కేసీఆర్ ఒక మోసగాడు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

మిగతా పార్టీలు కలిసి రాకున్నా నిరుద్యోగుల సమస్యలపై తమ పోరాటం ఆగదని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.

Update: 2023-04-05 10:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మిగతా పార్టీలు కలిసి రాకున్నా నిరుద్యోగుల సమస్యలపై తమ పోరాటం ఆగదని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. నిరుద్యోగుల కోసం కొట్లాటను తానెప్పుడో భుజాన ఎత్తుకున్నానని పార్టీ పెట్టక ముందే 72 గంటలు దీక్ష చేశానని గుర్తు చేశారు. బుధవారం నిరుద్యోగులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడిన షర్మిల నిరుద్యోగుల విషయంలో తమ కార్యచరణనను ప్రకటించారు. ఈ నెల 7వ తేదీన రాష్ట్రంలోని డిప్యూటీ కలెక్టర్లకు వినతి పత్రం అందజేయాలని నిర్ణయించారు.

8న రిలే దీక్షలు, 9న దిష్టిబొమ్మల దగ్ధం 10న హైదరాబాద్ లో టీసేవ్ ఫోరం సమావేశం ఉంటుందని చెప్పారు. 12వ తేదీన కాగడాలు ప్రదర్శిస్తామన్నారు. ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి కేసీఆర్ మోసం చేశాడని అతడో 420 అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగులు పరీక్షలు రాశారు. పేపర్ లీక్ తో అందరూ ఆందోళనలో ఉన్నారని చెప్పారు.

లీకేజీ విషయంలో సీబీఐ విచారణ జరిపించడానికి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేపర్ లీక్ కేసు పై చొరవ చూపాలి కదా అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు దొందు దొందే అని ఈ రెండు పార్టీలు నిరుద్యోగులను మోసం చేశాయన్నారు. దేశంలో కంటే నిరుద్యోగ శాతం రాష్ట్రంలో 2 శాతం అధికంగా ఉందని కనీసం ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాలు దొరకడం లేదన్నారు. 10 లక్షల మంది నిరుద్యోగులు లోన్లు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

విద్యార్థులకు కనీసం ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా ఇచ్చే దిక్కు రాష్ట్రంలో లేదు. రాష్ట్రంలో 1.91 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. బిశ్వాల్ కమిషన్ నివేదిక ప్రకారం పూర్తి స్థాయిలో ఉద్యోగాల భర్తీ జరగడం లేదన్నారు. నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ఆటలు ఆడుతున్నారు అందువల్లే టీసేవ్ ఫోరం ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించామన్నారు. ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడమే టీసేవ్ లక్ష్యం అని చెప్పారు.

పాలేరులో పోటీకి వస్తుందనే షర్మిలను తమ్మినేని అవమానించారు: గట్టు

పాలేరులో షర్మిల పోటీ చేస్తుందని తమ్మినేనికి భయం పట్టుకుందని అతను బీఆర్ఎస్ తో ఒప్పందం చేసుకొని పాలేరులో పోటీ చేస్తున్నాడని వైఎస్సార్ టీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు బుధవారం ఆరోపించారు. సీపీఎం కార్యాలయంలో మంగళవారం షర్మిల వర్సెస్ తమ్మినేని వీరభద్రం మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధంపై గట్టు రామచంద్ర రావు స్పందించారు. పాలేరు ప్రత్యర్థి షర్మిల కాబట్టే ఆమెను అవమానించేలా వ్యవహరించారని దుయ్యబట్టారు. తమ్మినేని బీఆర్ఎస్‌తో ఒప్పందం చేసుకున్నట్లుగా మాట్లాడారని తమ్మినేని మాదిరిగా మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరోలా మేము మాట్లాడలేమన్నారు. తమ్మినేని ఖబర్ధార్.. పాలేరులో షర్మిల గెలుపు ఖాయం అన్నారు.

తమ్మినేనికి రాజకీయ పరిపక్వత లేదని కేవలం పాలేరు పోటీ పంచాయతీని దృష్టిలో పెట్టుకుని నోటి దురద ప్రదర్శించారని అన్నారు. మేము ఆఫీస్‌కు రాకముందే ఒక ప్రెస్ మీట్ పెట్టి షర్మిల నాటకాలు ఆడుతుందని తమ్మినేని కామెంట్స్ చేశారు. నిజానికి నాటకాలు ఆడుతోంది మేము కాదు మీరు అని ఫైర్ అయ్యారు. మాకు బీజేపీతో కలిసి పని చేయాలని ఎప్పుడు లేదు. అందరికీ ఫోన్ చేసినట్లే బీజేపీకి ఫోన్ చేశామన్నారు. తమ్మినేని కేసీఆర్ డైరెక్షన్ లో నడుస్తున్నాడు తమ్మినేని మీరు ప్రజల పక్షమా బీఆర్ఎస్ పక్షమా అనేది స్పష్టం చేయాలన్నారు.

Tags:    

Similar News