యాదగిరిగుట్టలో డిప్యూటీ సీఎం భట్టికి అవమానం.. మండిపడుతోన్న నెటిజన్లు..!
యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాల తొలిపూజ కార్యక్రమం సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని విమర్శలు వ్యక్తం
దిశ, డైనమిక్ బ్యూరో: యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాల తొలిపూజ కార్యక్రమం సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీతో పాటు పలువురు నెటిజన్లు భట్టికి జరిగిన దానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం యాదగిరిగిగుట్ట బ్రహ్మోత్సవాల తొలిపూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి దంపతులకు, మంత్రులకు ఆలయ పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు.
ఈ సమయంలో సీఎం దంపతులు, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అక్కడ ఏర్పాటు చేసిన పీటలపై కూర్చోగా డిప్యూటీ సీఎం భట్టి, మహిళా మంత్రి కొండా సురేఖ నెలపై చిన్న పీటపై కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రికి, మహిళా మంత్రికి దేవుడి సాక్షిగా అవమానం జరిగిందంటూ పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.