హరీష్ రావుతో తెలంగాణలో BJP ఏక్‌నాథ్ షిండే ప్రయోగం: MLA శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలోనూ ఏక్ నాథ్ షిండే ప్రయోగాన్ని అమలు చేయబోతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.

Update: 2024-07-15 15:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోనూ ఏక్ నాథ్ షిండే ప్రయోగాన్ని అమలు చేయబోతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ విలీనానికి అంగీకరించకపోతే మాజీ మంత్రి హరీష్​ రావును అడ్డంపెట్టుకొని భ్రష్టు రాజకీయాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఆయన సోమవారం ఓ వీడియో రిలీజ్ చేశారు. కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రహస్య ఒప్పందాలకు నెమ్మదిగా తెర దించుతున్నాయన్నారు. ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావు బీజేపీతో సంప్రదింపులు జరిపారన్నారు.

హరీష్  రావును పొగడ్తలతో ముంచెత్తడం వెనుక ఆయనతో రాజీనామా చేయించి బీజేపీ తరపున పోటీ చేయించే ఆలోచన ఉన్నదన్నారు. అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా సిద్దిపేటలో హరీష్ రావు మళ్లీ గెలుస్తాడని బండి సంజయ్ అంటున్నారన్నారు. హరీష్​రావు పై వచ్చిన పొగడ్తలను బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సమర్ధిస్తారా..? అంటూ ప్రశ్నించారు. ఆ నేతల వ్యాఖ్యలను వరుసగా పరిశీలిస్తే మెద‌లో బీజేపీ, బీఆర్ఎస్‌లు కుమ్మక్కైయ్యాయని స్పష్టంగా అర్ధమవుతుందన్నారు.

Tags:    

Similar News