శ్రీధర్ బాబుకు CM అయ్యే అర్హత ఉంది.. కానీ ఆ తెలివే లేదు.. MP అర్వింద్ హాట్ కామెంట్స్
తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అర్వింద్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ముఖ్యమంత్రిని మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్(Congress High Command) ఆలోచిస్తోందని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి(Telangana CM) అయ్యే అన్ని అర్హతలు మంత్రి శ్రీధర్ బాబుకు ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు. అయితే.. పార్టీలోని కొందరు నేతల్లాగా శ్రీధర్ బాబు(Minister Sridhar Babu)కు అక్రమ వసూళ్లు చేయడం చేతకాదని.. అందుకే ఆ పార్టీ అధిష్టానం వెనకడుగు వేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ వసూళ్లకు పాల్పడటం, అధిష్టానానికి మూటలు పంపించడం శ్రీధర్ బాబుకు కూడా తెలిసి ఉంటే.. ఆయనే సీఎం అయ్యేవాడని అన్నారు. ధర్మపురి అర్వింద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
మరోవైపు.. నిన్న కూడా ధర్మపురి అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి సీఎం రేవంత్‌రెడ్డి సహకారం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాకే బీజేపీ రాష్ట్రంలో బలపడిందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది తమ పార్టీ నేతల చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ప్రజలు రేవంత్ రెడ్డిని తురుంఖాన్ అనుకున్నారని.. కానీ ఆయన జోకర్ అని సీఎం అయ్యాకే తేలిపోయిందని విమర్శించారు.