పోటా పోటీగా పాదయాత్రకు టీ-కాంగ్రెస్ సీనియర్లు ప్లాన్
టీ కాంగ్రెస్‌లో మరిన్ని పాదయాత్రలు షురువయ్యే చాన్స్కనిపిస్తున్నది. టీ పీసీసీ అధ్యక్షుడు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని సీనియర్లు ఇప్పటికే రేవంత్యాత్రకు దూరంగా ఉంటున్నది తెలిసిందే.
దిశ, తెలంగాణ బ్యూరో: టీ కాంగ్రెస్‌లో మరిన్ని పాదయాత్రలు షురువయ్యే చాన్స్కనిపిస్తున్నది. టీ పీసీసీ అధ్యక్షుడు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని సీనియర్లు ఇప్పటికే రేవంత్యాత్రకు దూరంగా ఉంటున్నది తెలిసిందే. దీనికి తోడు ఏఐసీసీ ప్రోగ్రామ్స్ అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ పోరు యాత్ర పేరిట మరో పాదయాత్రను కూడా స్టార్ట్ చేశారు. ఇది విజయవంతంగా కొనసాగుతున్నది. దీనికి కంటిన్యూగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోనూ సీనియర్లు ఆధ్వర్యంలో పాదయాత్రను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆయా జిల్లాల్లోని సీనియర్లు, కీలక నేతలు కూడా పాదయాత్ర చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఇంటర్నల్‌గా ఓ నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు మరి కొందరు సీనియర్లు పాదయాత్రలు ప్రారంభించే చాన్స్ స్పష్టంగా కనిపిస్తున్నది.
జిల్లాల్లో ప్రభావం చూపేలా...
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ జిల్లాలో ఆయన మరికొంత మంది సీనియర్లను కలుపుకొని పాదయాత్ర చేస్తే పార్టీకి మేలు జరుగుతుందని రేవంత్‌ను వ్యతిరేకిస్తున్న వర్గం వాదన. నల్లగొండలో మొదలు పెట్టి రంగారెడ్డిని టచ్‌చేస్తూ హైదరాబాద్వరకు పాదయాత్ర చేయాలనేది పార్టీలో సీనియర్ల ప్రపోజల్. ఉమ్మడి ఖమ్మంలో భట్టి నేతృత్వంలో పాదయాత్రను షురూ చేసి, ఆ జిల్లాలోని సీనియర్లందరినీ భాగస్వామ్యం చేయాలని సీనియర్కాంగ్రెస్నేతలు భావిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లోనూ సీనియర్లందరినీ ఏకతాటిపై కి తీసుకువచ్చి పాదయాత్ర చేయాలని ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. అన్ని జిల్లాల్లో సీనియర్ల ఆధ్వర్యంలో పాదయాత్రలు జరగాలని కేడర్ఒత్తిడి తెస్తున్నట్లు గాంధీభవన్‌లో చర్చ జరుగుతున్నది. ఇప్పటికే కొందరు సీనియర్లు పాదయాత్రపై క్షేత్రస్థాయి లీడర్ల నుంచి ఫీడ్బ్యాక్కూడా తెప్పించుకుంటున్నారు. మరి కొందరు నియోజకవర్గాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు. అయితే సీనియర్లు చేయాలనుకుంటున్న మరో పాదయాత్ర, రేవంత్ఇటీవల చేసిన హాథ్‌సే హాథ్యాత్ర రూట్లలో నిర్వహించాలనుకోవడం గమనార్హం.
రేవంత్‌కు తలనొప్పి..
సీనియర్లంతా తలోదారి పడుతుండటంతో టీ పీసీసీ అధ్యక్షుడికి పార్టీలో ఏం జరుగుతున్నదనేది? అర్థం కావడం లేదు. రేవంత్దురుసుతనంతోనే దూరం అవుతున్నామని సీనియర్లు ఆఫ్‌ది రికార్డులో ఇప్పటికే వెల్లడించారు. వాళ్లను తన వైపు తిప్పుకునేందుకు రేవంత్ వివిధ ప్రయత్నాలు చేసినా, ఫలితాలు రావడం లేదు. స్వయంగా ఏఐసీసీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ చార్జి థాక్రే ఎంట్రీ ఇచ్చినా.. పరిస్థితులు చక్కబడలేదు. పైగా ఇప్పుడు ఎన్నికల సీజన్సమీపిస్తున్న తరుణంలో సీనియర్లు తీసుకుంటున్న నిర్ణయాలు రేవంత్ కు తలనొప్పిగా మారాయి. దీంతో ఏం చేయాలో? అర్థం కాగా రేవంత్‌వర్గం కూడా తలలు పట్టుకుంటున్నదని గాంధీభవన్‌లోని ఓ నేత చెప్పారు.