దనసరి సీతక్క అనే నేను.. తెలంగాణ మంత్రిగా సీతక్క ప్రమాణ స్వీకారం

తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

Update: 2023-12-07 08:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి కేబినెట్ లో ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళ పై ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ మాస్ లీడర్ గా పేరుగాంచిన సీతక్క నక్సలైట్ నుంచి తెలంగాణ మంత్రిగా ఎదిగింది. కాగా సీతక్క ప్రమాణం సందర్భంగా సీతక్క అనే నేను అనగానే ఎల్బీ స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. 

Tags:    

Similar News