విద్యార్థులకు శుభవార్త.. బడి వేళల్లో మార్పులు..!

తెలంగాణలో రేపటి నుంచి (జూన్ 12) బడి గంటలు మోగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యాశాఖ అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలను పంపిణీ చేశారు.

Update: 2024-06-11 10:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రేపటి నుంచి (జూన్ 12) బడి గంటలు మోగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యాశాఖ అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలను పంపిణీ చేశారు. రాజోలిలోని ఎమ్మార్సీ కార్యాయంలో సీఆర్పీ శాంతయ్య పలు స్కూళ్ల ప్రధానోపాధ్యాయులకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పుస్తకాలను అందజేశారు. రేపటి నుంచి స్కూళ్లకు వచ్చే స్టూడెంట్స్ కు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయాలని అధికారులు తెలిపారు. అయితే అధికారికంగా ప్రకటించనప్పటికీ తాజా సమాచారం ప్రకారం.. తెలంగాణ పాఠశాలల్లో విద్యాశాఖ టైమింగ్స్ మార్పు చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 2024 - 2025 విద్యా సంవత్సర క్యాలెండర్ ప్రకారం.. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఉదయం 9 నుండి సాయంత్రం 4 వరకు, అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఉదయం 9 నుండి సాయంత్రం 4.15 వరకు ఉండనుందట. అలాగే హైస్కూల్ విద్యార్థులకు ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.45 వరకు ఉండనుందని సమాచారం. 


Similar News