స్కూల్ బస్సు బోల్తా.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

అదుపు తప్పి స్కూల్ బస్సు బోల్తా పడింది.

Update: 2023-08-02 03:57 GMT

దిశ, దంతాలపల్లి : అదుపు తప్పి స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లడా గ్రామ శివారులో చోటు చేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న తొర్రూరులోని ప్రైవేట్ పాఠశాల శ్రీ నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పత్తి చేనులో బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా పిల్లల స్వల్ప గాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి గల కారణం తెలియాల్సి వుంది.


Similar News