ఇంటర్ వొకేషనల్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫైనల్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్

ఇంటర్ వొకేషనల్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫస్టియర్‌లో పార్ట్ ‘ఏ’కు సంబంధించి జనరల్ ఫౌండేషన్ కోర్సును 28వ తేదీన,

Update: 2023-12-29 17:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ వొకేషనల్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫస్టియర్‌లో పార్ట్ ‘ఏ’కు సంబంధించి జనరల్ ఫౌండేషన్ కోర్సును 28వ తేదీన, ఇంగ్లిష్ పేపర్‌ను మార్చి 1వ తేదీన నిర్వహించనున్నారు. మార్చి 4, 6, 11 తేదీల్లో ఆయా సబ్జెక్టుల వారీగా పార్ట్ బీ పరీక్ష జరగనుంది. ఇకపోతే బ్రిడ్జి కోర్సుకు సంబంధించి మ్యాథమేటిక్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలను మార్చి 13వ తేదీన, ఫిజికల్ సైన్స్ పరీక్షను మార్చి 15వ తేదీన నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంటర్ వొకేషనల్ సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 29న ప్రారంభంకానున్నాయి. సెకండియర్‌లో పార్ట్ ఏకు సంబంధించి జనరల్ ఫౌండేషన్ కోర్స్‌కు 29న పరీక్ష జరగనుంది. ఇంగ్లిష్ పేపర్‌కు మార్చి 2వ తేదీన ఎగ్జామ్ నిర్వహించనున్నారు. సెకండియర్ పార్ట్ బీకి సంబంధించి మార్చి 5, 7, 12 తేదీల్లో ఆయా సబ్జెక్టుల వారీగా పరీక్ష నిర్వహించనున్నారు. ఇకపోతే సెకండియర్ బ్రిడ్జి కోర్సుకు సంబంధించి మ్యాథమేటిక్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షను మార్చి 14వ తేదీన, ఫిజికల్ సైన్స్ పరీక్షను మార్చి 16వ తేదీన నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టంచేశారు.


Similar News