SBI debit card: మీరు ఎస్‌బీఐ డెబిట్ కార్డు వాడుతున్నారా..? అయితే ఇక మీకు చార్జీల మోతే

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు షాకిచ్చింది.

Update: 2024-03-27 07:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు షాకిచ్చింది. కొన్ని కోట్ల మంది వినియోగదారుల కోసం ఆ బ్యాంకు సొంతం. రకరకాల డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులను తన కస్టమర్లకు అందజేస్తోంది. అయితే, సేవలు అందించేందుకు గాను ఆయా కార్డులపై ఛార్జీలను ఎస్‌బీఐ వసూలు చేస్తోంది. ఇందులో భాగంగా కాంటాక్ట్ లెస్, సిల్వర్, గ్లోబల్ పేరుతో ఇలా రకరకాల కార్డులను ప్రవేశ పెట్టింది. కార్డుల నిర్వహణకు మేయిన్‌టెనెన్స్ చార్జీల కింద సంవత్సరానికి రూ.125 వసూలు చేస్తోంది. అయితే, ఇప్పుడు ఆ చార్జీలను పెంచేందుకు ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పెంచిన రేట్ల ప్రకారం ఇక మీదట డెబిట్ కార్డ్ నిర్వహణకు ఏడాదికి రూ.200, అదనంగా జీఎస్టీ ఛార్జీలను కూడా కస్టమర్ల నుంచి వసూలు చేయనుంది. ఏప్రిల్ 1 నుంచి పెంచిన చార్జీలు అమల్లోకి రానున్నాయి.

Tags:    

Similar News