కలెక్టరేట్ ఎదుట అధికార పార్టీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం (వీడియో)
అధికార పార్టీ సర్పంచ్ కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అధికార పార్టీ సర్పంచ్ కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. గ్రామపంచాయతీలో అభివృద్ధి పనుల కోసం వెచ్చించిన బిల్లుల మంజూరులో ఉప సర్పంచ్ సంతకాలు చేయడం లేదని, ఎమ్మెల్యే సహకరించడం లేదని రూ.3 కోట్ల అప్పులయ్యాయని అధికార పార్టీ సర్పంచ్ దంపతులు కొత్త కలెక్టరేట్లో ఆత్మహత్యయత్నానికి యత్నించారు. ఈ ఘటన సోమవారం ఉదయం జరగగా వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ న్యూ కలెక్టరేట్ వద్ద నందిపేట సర్పంచ్ సాంబారు వాణి, ఆమె భర్త తిరుపతి ఆత్మహత్యాయత్నం చేశారు.
బీసీ కులానికి చెందిన సర్పంచ్ అవడం వల్ల గత నాలుగు సంవత్సరాల నుండి స్థానిక ఉపసర్పంచ్ మాద రవి అభివృద్ధి పనుల బిల్లులపై సంతకాలు పెట్టకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సుమారు కోటిన్నర రూపాయలు నందిపేట మండల అభివృద్ధికి వెచ్చించానని తెలిపారు. బిల్లులు మంజూరు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా సహకరించడం లేదని సర్పంచ్ సాంబారు వాణి ఆరోపించారు.
కోటిన్నర లక్షలకు మిత్తితో కలిపి మూడు కోట్లకు పైగా అప్పు అయిందని అప్పుల బాధ భరించలేక కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించమని వారు వాపోయారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని కలెక్టరేట్ ఎదుట కూర్చున్నారు. సర్పంచ్ భర్త తనతో తెచ్చుకున్న పెట్రోలును తన భార్యతో పాటు తనపై పోసుకొని ఆత్మహత్యనికి పూనుకున్నాడు. పోలీసులు వెంటనే స్పందించి సర్పంచ్ దంపతులను అడ్డుకున్నారు.
Read more: