TG: తెలంగాణ ప్రజలకు సర్కార్ సంక్రాంతి శుభవార్త

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో శనివారం కేబినెట్(Telangana Cabinet) భేటీ నిర్వహించారు.

Update: 2025-01-04 14:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో శనివారం కేబినెట్(Telangana Cabinet) భేటీ నిర్వహించారు. కొత్త రేషన్ కార్డులు(Ration cards), రైతు భరోసా(Rythu Bharosa)సై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. పంట పండిన ప్రతి ఎకరాకు రైతుభరోసా(Rythu Bharosa) ఇవ్వాలని నిర్ణయించారు. సంక్రాంతి పండుగకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలనీ నిర్ణయించారు. అంతేకాదు.. 11 కొత్త మండలాలు, 200 కొత్త గ్రామా పంచాయతీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి నుంచి సన్నబియ్య ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపైనా తుది నిర్ణయానికి వచ్చారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం పంపిణీ, రైతుభరోసా కింద ఒక్కో ఎకరానికి ఒక్కో సీజన్‌కు రూ.6000 చొప్పున రూ.12 వేల చొప్పున ఇవ్వబోతున్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో ప్యాకేజీలు 2, 3కు సంబంధించిన ఎస్కలేషన్‌ ప్రపోజల్స్‌‌కు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News