MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో సంక్రాంతి వేడుకలు
తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
దిశ,డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళవారం తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతి (Sankranti celebrations) వేడుకలను కవిత జరుపుకున్నారు. స్వయంగా ఎమ్మెల్సీ కవిత స్వయంగా ముగ్గులు వేసి వేడుకల్లో పాలుపంచుకున్నారు. పండుగ సంప్రదాయం ఉట్టిపడేలా కవిత వేడుకలు నిర్వహించారు.
రాష్ట్ర ప్రజలు, రైతాంగం పాడిపంటలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆమె కోరుకున్నారు. కాగా, ఎక్స్ వేదికగా తన నివాసంలో వేసిన ముగ్గులు, పూజలు నిర్వహించిన ఫోటోలను కవిత నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త ఆరంభాలు, శుభాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. సంక్రాంతి పండుగ విషెస్ తెలిపారు.