ఇంకా ఊపేస్తున్న ‘శంకరాభరణం’ సాంగ్‌.. తెలంగాణ పోలీసుల ఆసక్తికర ట్వీట్

‘శంకరాభరణం’ 1980 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన సంగీత ప్రాధాన్యత గల చిత్రం. ఈ చిత్రం అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది.

Update: 2024-02-18 17:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ‘శంకరాభరణం’ 1980 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన సంగీత ప్రాధాన్యత గల చిత్రం. ఈ చిత్రం అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. ఆ సినిమాలోని అన్ని పాటలకు ఎంతో ప్రజాదరణ పొందింది. శంకరాభరణం సినిమా ప్రేరణతో చాలామంది కర్ణాటక సంగీతం నేర్చుకున్నారంటే సినిమా ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఆ సినిమాలో ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన ‘శంకరా నాదశరీరా పరా వేదవిహారా హరా జీవేశ్వరా’ ఆ రోజుల్లో అందరినీ అలరించింది.

ఇప్పటికీ ఆ పాటను నేటితరం వారు కూడా వింటున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తాజాగా.. ఓ స్కూల్లో ఓ బాలుడు పాడిన అదే పాట సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఆ పిల్లాడితో పాటు స్కూల్‌ బెంచ్‌, కంపాస్‌ బాక్స్‌‌ను డబ్బుగా చేసుకోని టీమ్‌గా పాటను పాడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీస్‌ శాఖ ఆ వీడియోను ట్యాగ్‌ చేస్తూ పిల్లల ప్రతిభను ట్విటర్‌ వేదికగా ప్రశంసించింది. ‘మన దేశంలో బాలలు/ యువ ప్రతిభకు కొదవలేదు.. తెలుసుకోవాల్సింది మంచి చెడుల మధ్య ఉండే సన్నని గీత మాత్రమే. అది తెలుసుకుంటే యువ భారతం ఫరిడవిల్లి ఆవిష్కరణలకు నిలయంగా అవుతుంది’ అని ట్వీట్‌ చేసింది. పిల్లల ప్రతిభ పై నెటిజన్లు సైతం ఫిదా అయిపోయారు.

Tags:    

Similar News