వాళ్లను పట్టుకొని శిక్షించే వరకు మా పోరాటం ఆగదు: RSP

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. నిరుద్యోగుల బాధలు, ఇబ్బందులు గాలికొదిలి అధికార, విపక్షాలు రాజకీయ విమర్శలు చేసుకొని కొంతకాలం రాష్ట్ర వాతావరణాన్ని వేడెక్కించాయి.

Update: 2023-04-22 03:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. నిరుద్యోగుల బాధలు, ఇబ్బందులు గాలికొదిలి అధికార, విపక్షాలు రాజకీయ విమర్శలు చేసుకొని కొంతకాలం రాష్ట్ర వాతావరణాన్ని వేడెక్కించాయి. అయితే, పేపర్ లీకేజీ కేసు నమోదై ఇప్పటికే నెల రోజులు గడిచినా నిందితులకు శిక్ష పడలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఆ లీకుల వెనకాల ఉన్న ప్రధాన సూత్రధారులెవరో ప్రపంచమంతటికీ తెలిసినా వారు చట్టం నుంచి రక్షణ పొందుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ‘టీఎస్‌పీఎస్‌సీలో ఇంటి దొంగలు ఇంకా సురక్షితంగానే ఉన్నరు. వాళ్లను పట్టుకునే దాకా తెలంగాణ పోరాటం ఆపదు.’ అని సోషల్ మీడియా వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు.

Tags:    

Similar News