మండుతున్న ఎండలు.. 7 జిల్లాలకు ఆరెంజ్, మిగిలిన వాటికి ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి చివరి వారం నుంచే ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా నమోదు అవుతుంది.
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి చివరి వారం నుంచే ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా నమోదు అవుతుంది. ఈ మేరకు తెలంగాణలో నేటి నుంచి 4 రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. 7 జిల్లాలకు ఆరెంజ్, మిగిలిన వాటికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 41-45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదు అవుతుందని ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో 36-40 మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా.. నగర వాసులు ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు తీసుకోవాలని అధికారులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.