ప్రగతి భవన్‌ను కూల్చాల్సిందే: రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు

ప్రగతి భవన్ చీకటి దందాలకు వేదికగా మారిందని.. ప్రజలకు ఎంట్రీ లేని ప్రగతి భవన్‌ను కూల్చాల్సిందేనని టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2023-02-08 13:46 GMT
Revanth Reddy will not Participate in Munugode Padayatra Due to Covid Symptoms
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ప్రగతి భవన్ చీకటి దందాలకు వేదికగా మారిందని.. ప్రజలకు ఎంట్రీ లేని ప్రగతి భవన్‌ను కూల్చాల్సిందేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రగతి భవన్‌ను నక్సలైట్లు డైనమైట్లతో పేల్చాలని రేవంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుండగానే.. బుధవారం ఓ చిట్ చాట్‌లో మాట్లాడిన రేవంత్ మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్‌ను నక్సలైట్లు పేల్చినా మాకు అభ్యంతరం లేదని.. ప్రజలకు, ప్రతిపక్షాలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఎందుకని మరోసారి ప్రశ్నించారు. నక్సల్స్ ఎజెండానే తమ ఎజెండా అని కేసీఆర్ అన్నారని.. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక నక్సలైట్లు శృతి, వివేక్‌ను కాల్చి చంపారని ఆరోపించారు. ఈ విషయంపై తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ప్రగతి భవన్‌ను నక్సలైట్లు కూల్చివేయాలన్నందుకు తనపై కేసులు పెడితే.. నక్సలిజం తన ఎజెండా అన్న సీఎం కేసీఆర్ పైన కేసులు పెట్టాలని డిమాండ్ చేశాడు. కేసీఆర్ అంటే ఒప్పు.. నేనంటే తప్పా అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, ప్రగతి భవన్‌ను నక్సలైట్లు కూల్చి వేయాలన్న రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. 

Also Read...

రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్, బ్లాక్ మెయిలర్: మంత్రి ఎర్రబెల్లి ఘాటు వ్యాఖ్యలు 

Tags:    

Similar News