అర్థాంతరంగా ముగిసిన Revanth Reddy US టూర్.. హుటాహుటిన హైదరాబాద్‌కు రిటర్న్..!
తానా సభల్లో హాజరయ్యే నిమిత్తం అమెరికా పర్యటనకు వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అర్థాంతరంగా తన పర్యటన ముగించుకుని స్వరాష్ట్రానికి బయలుదేరారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తానా సభల్లో హాజరయ్యే నిమిత్తం అమెరికా పర్యటనకు వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అర్థాంతరంగా తన పర్యటన ముగించుకుని స్వరాష్ట్రానికి బయలుదేరారు. నిజానికి ఆయన జులై 15వ తేదీ వరకు అమెరికా పర్యటనలోనే ఉంటారని తొలుత ఆయన సన్నిహితులు వెళ్లడించారు. కానీ అనూహ్యంగా షెడ్యూల్ కంటే ముందే ఆయన తిరిగి రాష్ట్రానికి బయలుదేరడం ఆసక్తిగా మారింది.
తానా సభల నిమిత్తం యూఎస్ వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌పై ఆయన చేసిన కామెంట్స్ పొలిటికల్‌గా తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో హుటాహుటిన ఆయన తిరిగి రాష్ట్రానికి బయలుదేరడం పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తిగా మారింది.