‘‘మీ దోస్త్ సంతోష్ వచ్చిండంటగా.. మరీ అరెస్ట్ చేస్తారా..?’’ సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తున్నదని తెలంగాణ ప్రజలకు మొర
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తున్నదని తెలంగాణ ప్రజలకు మొర పెట్టుకున్నది యాదికున్నదా? అని ప్రశ్నించారు. ‘అదే తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఇద్దరు తోడు దొంగలు ఆడిన నాటకం గుర్తొచ్చిందా? ఆ కేసుకు ఏడాది కావొస్తున్న శుభ సందర్భంలో.. మీ సర్కారును కూలదోస్తామన్న కుట్రదారు బీజేపీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ హైదరాబాద్ వచ్చిండటగా.. ఇన్నాళ్లు అడ్రస్ దొరకలేదని తప్పించుకుంటిరి.. మరి ఇప్పుడైనా ఆయనను అరెస్టు చేసే దమ్ముందా? ఆ కట్టుకథను ప్రజలు మర్చిపోతారులే అని అతిథ్యమిస్తారా? లేక సిట్‌ను నిద్రలేపి అరెస్టేమైనా చేస్తారా? తెలంగాణ చూస్తోంది.. మీ సమాధానం కోసం..!!’ అంటూ సవాల్ చేశారు.