నాగారంలో రోడ్డు ఆక్రమణల తొలగింపు.. మున్సిపల్ చైర్మన్‌పై పోలీసులకు హైడ్రా ఫిర్యాదు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలంలోని ఈస్ట్ హనుమాన్ నగర్ సర్వే నెం.146లో 40 అడుగుల విస్తీర్ణంలో ఉన్న రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాన్ని బుధవారం హైడ్రా అధికారులు కూల్చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలంలోని ఈస్ట్ హనుమాన్ నగర్ సర్వే నెం.146లో 40 అడుగుల విస్తీర్ణంలో ఉన్న రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాన్ని బుధవారం హైడ్రా అధికారులు కూల్చేశారు. నాగారం ప్రధాన రహదారికి కలిసే రోడ్డును నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి ఆక్రమించి ప్రహరీ నిర్మించినట్లుగా హైడ్రాకు ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టిన అధికారులు రోడ్డును ఆక్రమించినట్లుగా గుర్తించి హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు కూల్చేశారు.
నాగారంలో రోడ్డు ఆక్రమణల తొలగింపు.. మున్సిపల్ చైర్మన్‌పై పోలీసులకు హైడ్రా ఫిర్యాదునాగారం ప్రధాన రహదారికి కాలనీల నుంచి నేరుగా వెళ్లేందుకు అవకాశం లభించడంతో 5 కాలనీలకు చెందిన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కూల్చివేతల అనంతరం రహదారిని అక్కడ నిర్మించాలంటూ నాగారం మున్సిపల్ కమిషనర్‌ను హైడ్రా ఆదేశించింది. ఈ మేరకు రోడ్డును నిర్మించి స్థానిక కాలనీవాసులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని నాగారం మున్సిపల్ కమిషనర్ స్పష్టం చేశారు. రోడ్డును ఆక్రమించి ప్రహరీ నిర్మించిన నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డిపై కీసర పోలీస్ స్టేషన్‌లో హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు.