phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు ఊరట

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు ఊరట లభించింది.

Update: 2025-03-20 05:41 GMT
phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు ఊరట
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు (Harish Rao) ఊరట లభించింది. ఆయనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ (Panjagutta Police Station) లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును ఇవాళ హైకోర్టు కొట్టివేసింది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ (Chakradhar Goud) ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీశ్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ (Radhakishan Rao) రావుపై పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హరీశ్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తులో భాగంగా హరీశ్ రావును అరెస్టు చేయవద్దంటూ గతంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ఈ పిటిషన్ పై ఇరువైపుల వాదనలు ముగియడంతో హరీశ్ రావుపై దాఖలైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ తాజాగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News