అదానీ కంపెనీలపై RTI ఎంక్వైరీ వేయాలి: మల్లు రవి

అదానీ కంపెనీలపై ఆర్టీఐ ఎంక్వైరీ జరగాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు.

Update: 2023-01-28 13:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అదానీ కంపెనీలపై ఆర్టీఐ ఎంక్వైరీ జరగాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. మోడీ నిర్ణయాలతో అన్ని సంస్థలు నష్టల్లోకి వెళ్లిపోతున్నాయని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేక ప్రభుత్వ రంగ సంస్థలు అదానీకి అప్పజెప్పారని, ఎల్ఐసీ, ఎస్బీఐతో పాటు అనేక సంస్థలు నష్టాల్లోకి పోతున్నాయన్నారు. అదానీకి ఇతర దేశాల్లో కాంట్రాక్ట్‌లు ఇప్పించడంలోనూ మోడీ సహకారం అందించారన్నారు. కానీ ఇప్పుడు నష్టాల్లోకి వెళ్తున్నామని అదానీ సంస్థలు ప్రకటించడంలో అనుమానం ఉన్నదన్నారు. ఇంత జరుగుతున్నా ,మోడీ ప్రేక్షకపాత్ర వహించడం సరికాదన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉన్నదన్నారు. వెంటనే నష్ట నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సంక్షోభానికి కారణాలపై విచారణ జరగాల్సిన అవసరం ఉన్నదన్నారు.

Tags:    

Similar News