కాంగ్రెస్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలోకి రవితేజ గౌడ్
కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా బుర్రా రవితేజ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా బుర్రా రవితేజ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలతో కొత్త మెంబర్‌ను నియమించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా బుర్ర రవితేజ గౌడ్ మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు ఇచ్చిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానన్నారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ గెలుపునకై కృషిచేస్తానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, వేములవాడ నియోజకవర్గానికి చెందిన బుర్ర రవితేజ గౌడ్ , ప్రస్తుతం స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్‌గా పార్టీకి సేవలు అందిస్తుండగా, ఇప్పుడు పార్టీ అదనపు బాధ్యతలు ఇచ్చింది.