వక్ఫ్ భూములంటూ ఇబ్బందులకు గురిచేయడం తగదు

వక్ఫ్ భూములంటూ ఇబ్బందులకు గురిచేయడం తగదని రాపోలు రాములు అన్నారు.

Update: 2023-02-26 11:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బోడుప్పల్ లో 350 ఎకరాల భూమి పాసు బుక్కులు ఉండి అక్కడి వాళ్లు అమ్ముకున్నారని, అప్పుడు ప్రభుత్వం లే ఔట్లకు పర్మిషన్ ఇచ్చిందని దింతో పేద మధ్య తరగతి వాళ్లు బోడుప్పల్ లో భూములు కొనుక్కొని ఇళ్లు కట్టుకున్నారని మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంఘాల సమాఖ్యచైర్మన్ రాపోలు రాములు అన్నారు. ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వాలు నాడు వారికి అన్ని సౌకర్యాలు కల్పించిందని 2020 లో వక్ఫ్ భూములు అని ప్రభుత్వం క్రయ విక్రయాలు నిలిపి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ట్యాక్స్ లు కట్టించుకొని ఇప్పుడు వక్ఫ్ భూములు అంటే ఇళ్లు కట్టుకున్న వాళ్ల పరిస్థితి ఏంటిని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయంతో 7 వేల కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి మంచి మనసుతో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.ప్రత్యేక చట్టం తీసుకువచ్చి వారికి న్యాయం చేయాలని కోరారు.అన్ని పార్టీల నేతలను కలుస్తమని వెల్లడించారు.

ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ని కలిసి మా సమస్యను వివరిస్తామని స్పష్టం చేశారు.యూపీ ప్రభుత్వం వక్ఫ్ నుంచి అక్కడి భూములకు మినహాయింపు ఇచ్చిందని తెలంగాణ ప్రభుత్వం మినహయింపు ఇవ్వాలని కోరారు. మంత్రి మల్లారెడ్డి చూస్తా చేస్తా అంటాడు తప్ప సమస్యను పరిష్కరించటం లేదని ఆరోపించారు.మంత్రి మల్లారెడ్డి ముఖ్యమంత్రితో చర్చించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News