ప్రాణం పోయినా ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వము..
ప్రాణం పోయినా పర్వాలేదు.. ఫార్మా కంపెనీకి భూములు
దిశ,బొంరాస్ పేట్ : ప్రాణం పోయినా పర్వాలేదు.. ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వలేమని రైతులు వాపోయారు.మంగళవారం దుద్యాల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన పోలేపల్లి,హకీంపేట్,లగ చర్ల, పులిచర్ల కుంట,రోటి బండ తండాల రైతులు తమ భూములను బలవంతంగా తీసుకోవద్దని,తమ గోడును తాసిల్దార్ కు వివరించారు. రెవెన్యూ అధికారి నుంచి పోలేపల్లి లోని 67 సర్వే నెంబర్ గల రైతులకు సమాచారం (ఫోన్)రావడంతో,రైతులు కార్యాలయానికి వెళ్లారు. ఏకంగా ఒక మహిళా రైతు తమ వెంబడి తీసుకొచ్చిన, మందు బాటిల్ తాగి ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని తన ఆవేదన వ్యక్తం చేయడంతో,అక్కడ ఉన్న రైతులు ఆ బాటిల్ ను తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.