ప్రభుత్వ కార్యాలయాల్లో కరప్షన్ అనే పదం వినపడకూడదు : ఎమ్మెల్యే

ప్రభుత్వ కార్యాలయాల్లో కరప్షన్ అనే పదం వినపడకూడదని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.

Update: 2025-01-13 12:35 GMT
ప్రభుత్వ కార్యాలయాల్లో కరప్షన్ అనే పదం వినపడకూడదు : ఎమ్మెల్యే
  • whatsapp icon

దిశ, షాద్ నగర్ : ప్రభుత్వ కార్యాలయాల్లో కరప్షన్ అనే పదం వినపడకూడదని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం షాద్ నగర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం సంతోషకరమైన వార్త అందించబోతుందని సంక్రాంతి కానుకగా మరో నాలుగు కొత్త పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందించబోతుందని ఇది రాష్ట్ర ప్రజలకు సంతోషకరమైన విషయమని అన్నారు.

గత పది 10 సంవత్సరాల లో బి ఆర్ ఎస్ పార్టీ ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేని స్థితి నెలకొందని, అక్కడక్కడ అరకొరగా కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు సైతం సరైన మౌలిక వసతులు లేని దీనస్థితిలో ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రైతు బిడ్డ అని రాష్ట్రంలో రైతునే రాజుగా మార్చాలన్నదే రేవంత్ రెడ్డి కల అని అన్నారు. కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వ ఫలాలను నిరుపేదలకు అందే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, చలో శ్రీకాంత్ రెడ్డి, వీరేశం, మాజీ జెడ్పిటిసి వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చైనీస్ తిరుపతిరెడ్డి, రఘునాయక్, దంగు శ్రీనివాస్ యాదవ్, పురుషోత్తం రెడ్డి, లింగారెడ్డిగూడెం అశోక్ తదితరులు ఉన్నారు.


Similar News