సీఎం రేవంత్ చొరవతో రాష్ట్రమంతా అభివృద్ధి : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన

Update: 2025-04-12 16:05 GMT

దిశ,పరిగి : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాతే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని గ్రామాల అభివృద్ధి జరుగుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి నివాసంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు, అధోగతి పాలు చేసిందని అన్నారు. ఇవన్నీ లెక్కచేయకుండా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తున్నారని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి ఒకవైపు, సంక్షేమ ఒకవైపు ప్రతి గ్రామంలో, మండలంలో, నియోజకవర్గంలో,రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతి గ్రామంలో 40 నుంచి కోటి రూపాయల వరకు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చింరని విమర్శించారు. మహమ్మదాబాద్,గండేడ్ మండలాలను పరిగిలో కలుపుతామని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.18 కోట్లతో రైల్వే సర్వే పనులు కూడా పూర్తి అయ్యాయని అన్నారు. త్వరలోనే కేసి లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని ఈ ప్రాంతంసస్యశ్యామలమవుతుందని తెలిపారు.అనంతరం తాండూర్ ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా వాసులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.15 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు.25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో అన్ని రోడ్లు వేస్తున్నామని అన్నారు.120 కోట్లతో కోట్పల్లి ప్రాజెక్టు పనులు, 12 కోట్లతో జుంటుపల్లి ప్రాజెక్టు పనులు, శివసాగర్ పనులు జరుగుతున్నాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

Similar News