ఆదమరిస్తే అంతే..ప్రమాదం అని తెలిసి ప్రయాణాలు
రద్దీగా ఉండే మొండి గౌరెల్లి, గాండ్లగూడ, గ్రామాలకు వెళ్లే సాగర్ రహదారి రోడ్లు
దిశ, యాచారం: రద్దీగా ఉండే మొండి గౌరెల్లి, గాండ్లగూడ, గ్రామాలకు వెళ్లే సాగర్ రహదారి రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారాయి. రెండు సంవత్సరాల క్రితం ఓ స్కూల్ బస్సు ద్విచక్ర వాహనదారున్ని ఢీకొనడంతో ఆ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ప్రమాదాలను నివారించడానికి అతి వేగంగా వెళ్లే వాహనాలను కట్టడి చేయడానికి ఆర్.అండ్.బి అధికారులు కంటి తుడుపు చర్యలుగా మొండి గౌరెల్లి, గ్రామానికి వెళ్లే కూడలి వద్ద రోడ్డుకు ఇరువైపులా సీసీ రోడ్డుపై బీటీ రోడ్లపై ఏర్పాటు చేసే డివైడర్ ను తాత్కాలికంగా నిర్మించారు. అవి నేడు రోడ్డుకు సమాంతరంగా మారి వెక్కిరిస్తున్నాయి దూరం తగ్గుతుందని చౌదర్ పల్లి, రోడ్డు నుండి ఓ ద్విచక్ర వాహనదారుడు అపసవ్య దిశలో వచ్చి మరొక ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి అపస్మారక స్థితికి చేరుకొని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇలాంటి ప్రమాదాలు నిత్యం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గడిచిన 6 నెలల కాలంలో 20 మంది వరకు రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డారంటే ప్రమాదాల తీవ్రతను తెలియజేస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
దూరం తగ్గుతుందని ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు : యాచారం సీఐ శంకర్ కుమార్
పుడమి స్కూల్, చౌదర్ పల్లి, గ్రామం వచ్చే వాహనదారులు దూరం తగ్గుతుందని మొండి గౌరెల్లి, గ్రామానికి వెళ్లే రోడ్డు వద్ద నుండి యూటర్న్ తీసుకునే ప్రయత్నంలో అపసవ్య దిశలో ప్రయాణించి ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. వాటిని కట్టడి చేయడానికి ప్రతిరోజు వాహనాల తనిఖీ చేస్తున్నట్లు ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.
బారీ గేట్లను ఏర్పాటు చేయండి : మొండి గౌరెల్లి గ్రామస్తుడు, వెంకటేష్ ముదిరాజ్
యాచారం మండలంలోని మొండి గౌరెల్లి, రోడ్డు వద్ద సాగర్ రహదారి పై హైదరాబాద్ నుంచి వేగంగా వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. భారీ కేట్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.