Sanitation : గిరిజన తండాలంటే చిన్న చూపా..
గ్రామాల్లో చెత్త నిర్మూలించి పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దిలానే
దిశ,పెద్దేముల్: గ్రామాల్లో చెత్త నిర్మూలించి పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దిలానే సంకల్పంతో గత ప్రభుత్వం డంపింగ్ యార్డ్ నిర్మించి గ్రామంలోని చెత్తను తరలిస్తున్నారు. పెద్దేముల్ తండా వాసులకు అదే డంపింగ్ యార్డ్ రోగాలకు నిలయంగా మారిందని పెద్దేముల్ తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ నిర్వహణ లోపించడంతో గ్రామంలో సేకరించిన చెత్తను పెద్దేముల్ తండా సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ లో నిల్వ చేయడంతో వర్షాలకు కూలిన చెత్తతో డంపింగ్ యార్డ్ చుట్టుముట్టు దుర్వాసన వ్యాపిస్తుంది అలాగే స్థానికులకు చర్మవ్యాదులు సోకుతున్నాయని డంపింగ్ యార్డ్ వల్ల తాండ లో వీధి కుక్కలు విపరీతంగా సంచరిస్తు పశువులపై తాండవ వాసులపై దాడులు చేస్తున్నాయని తక్షణమే డంపింగ్ యార్డ్ ను ఉన్నతాధికారులు సందర్శించి తండా నుంచి డంపింగ్ యార్డ్ ను ఇతర ప్రదేశానికి తరలించాలని తండా వాసులు కోరుతున్నారు.
డంపింగ్ యర్డ్ లో నిర్వహణ లోపించింది: తండా వాసి శ్రీనివాస్
పెద్దేముల్ మండల కేంద్రం నుంచి ప్రతిరోజు డంపింగ్ యార్డ్ కు చెత్తను తరలించి ఇష్టారాజ్యంగా ఎక్కడంటే అక్కడ డంపింగ్ చేయడంతో తండా వాసులకు తీవ్రమైన సమస్యలు ఉత్పన్నమై తున్నాయని ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని తండా వాసి శ్రీనివాస్ కోరుతున్నారు.
గిరిజన తండాలపై చిన్న చూపు చూస్తున్న ప్రభుత్వం
పెద్దేముల్ మండల కేంద్రం నుంచి చెత్తను సేకరించి గిరిజనులు నివాసముండే పెద్దేముల్ తండా సమీపంలో డంపింగ్ యార్డుకు ఏర్పాటు చేసి గ్రామంలోని మురికిని తరలించి డంప్ చేయడంతో తండా వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. చెత్త మురికి నీళ్ల కాలువలలో కలిసి పశువులు తాగే నీరు కలుషితమై పశువులకు రోగాలు సంభవిస్తున్నాయి.స్థానికంగా ఉండే రైతులకు తండా వాసులకు చర్మ వ్యాధులు ఊపిరితిత్తుల తదితర వ్యాధులు వ్యాపిస్తున్నయని డంపింగ్ యార్డ్ వల్ల కుక్కలు తండాలో విహారం చేయడంతో తండావాసులు భయాందోళన చెందుతున్నారనీ,ఉన్నతాధికారులు స్పందించి డంపింగ్ యార్డును సందర్శించి డంపింగ్ యార్డ్ ను తండా నుంచి వేరే చోటుకు తరలించాలి. ప్రజల పడుతున్న సమస్యలను పరిష్కరించాలని తండా వాసి రాహుల్ నాయక్ కోరుతున్నారు.