మళ్లీ వీధికుక్కల స్వైర్య విహారం

నిన్న అపార్ట్​మెంట్​పార్కింగ్ లో కూతురిపై వీధికుక్కల దాడి మరువక ముందే తాజాగా కిరాణాదుకాణానికి.... Stray dog menace at badangpet

Update: 2023-03-25 10:37 GMT

దిశ, బడంగ్​పేట్: నిన్న అపార్ట్​మెంట్​పార్కింగ్ లో కూతురిపై వీధికుక్కల దాడి మరువక ముందే తాజాగా కిరాణాదుకాణానికి వెళ్తున్న 5 ఏళ్ల కుమారుడిపై వీధి కుక్కల స్వైర్య విహారం చేశాయి. కుక్కలు బాలుడిపై విరుచుకుపడుతుండడంతో గమనించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. అప్పటికే కుక్కల దాడిలో బాలుడి కంటి పైభాగం, చెవి, వీపు భాగాలలో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. బాలుడిని చికిత్స నిమిత్తం నారాయణగూడలోని ఆసుపత్రికి తరలించారు.

వివరాలలోకి వెళితే... బడంగ్​పేట్​మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడ టీచర్స్ కాలనీకి చెందిన శారద, భర్త మానసిక వికలాంగుడు. వీరికి ఇద్దరు కూతుళ్ళు, ఒక కుమారుడు ఉన్నారు. దీంతో భార్య టీచర్స్​కాలనీలో ఓ ఆపార్ట్​ మెంట్​లో వాచ్​మెన్​గా విధులు నిర్వర్తిస్తుంది. శుక్రవారం శారద రెండవ కూతురు సింధు అదే అపార్ట్​మెంట్​ పార్కింగ్​లో అడుకుంటుంది. గేట్​తెరిచి ఉండడంతో ఒక్కసారిగా అపార్ట్​మెంట్ పార్కింగ్​లోకి చొరబడ్డ వీధికుక్కలు సింధుపై దాడిచేసి గాయపరిచాయి. ఈ ఘటనలో సింధు వీపుపై గాయాలయ్యాయి. తాజాగా శనివారం శారద ఒక్కగానొక్క కుమారుడు హేమంత్(5) కిరాణా దుకాణానికి వెళ్తుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు అటాక్​చేశాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కుక్కలను తరమికొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. అప్పటికే హేమంత్​కంటి పైభాగం, చెవి, వీపు భాగాలలో దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాలైన బాలుడిని శారద చికిత్స నిమిత్తం నారాయణ గూడలోని ఆసుపత్రికి తరలించారు.

టీచర్స్ కాలనీలో కుక్కలు బాబోయ్​కుక్కలు .....

అదే కాలనీకి చెందిన ఓ ఇంటి యజమాని వీధికుక్కలకు ప్రతిరోజు అన్నం పెడుతుండడంతో ఆ ఇంటి వైపుగా వచ్చేవారిపై వీధికుక్కలు దాడిచేసేవి. బైక్​పై వెళ్ళే వారిని సైతం కుక్కలు దాడి చేసి గాయపరిచేవి. అటుగా ఇద్దరు వ్యక్తులు బైక్​పై వెళ్తుండడంతో వీధి కుక్కల దాడికి కిందపడి తీవ్రగాయాలు అయిన సందర్భాలు లేకపోలేవు. దీంతో టీచర్స్​ కాలనీ అసోసియేషన్​ప్రతినిధులు రోజురోజుకు కుక్కల దాడి తీవ్ర తరం అవుతుండడంతో బడంగ్​పేట్​మున్సిపల్​కార్పొరేషన్​కమిషనర్​కు 19 సెప్టెంబర్​2022లో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని టీచర్స్​కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.

Tags:    

Similar News