హైడ్రా కు మద్దతుగా సేవ్ లేక్ సేవ్ లైఫ్ కార్యక్రమం

రాజేంద్రనగర్ గండిపేట్ చెరువు దగ్గర సేవ్ లేక్, సేవ్ లైఫ్ హైడ్రా సపోర్ట్ వాక్

Update: 2024-08-25 11:33 GMT

దిశ, గండిపేట్: రాజేంద్రనగర్ గండిపేట్ చెరువు దగ్గర సేవ్ లేక్, సేవ్ లైఫ్ హైడ్రా సపోర్ట్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. హైడ్రా చేస్తున్న కార్యక్రమాల్ని అభినందిస్తున్నామని విద్యార్థులు, స్థానికులు, విద్యార్థులు కాలనీవాసులు అంతా కలిసి హైడ్రా కు మద్దతుగా నిలిచారు. ఇప్పటికే దాదాపుగా చెరువులన్నీ కబ్జాలకు గురి చేశారు. బెంగళూరు మాదిరిగా హైదరాబాద్ లో కూడా చెరువులని కాపాడకపోతే ఎండాకాలంలో నీరుకు ఇబ్బందిగా ఉంటుందని అన్నారు.

హైడ్రా చేస్తున్న కార్యక్రమానికి దాదాపుగా 500 మంది తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. రానున్న తరానికి నీరు తో పాటు చెరువులని కాపాడుకునే బాధ్యత ఉందని విద్యార్థులు కూడా పూర్తి అవగాహనతో ఎక్కడ చెరువులని కబ్జా చేసిన ఎఫ్ టి ఎల్ ల్యాండ్ లో నిర్మాణాలు చేసిన దానితోపాటు ప్రభుత్వ స్థలాలను కూడా కాపాడుకునే బాధ్యత మనపై ఉంటుందన్నారు. ఎక్కడ ఏం జరిగినా హైడ్రాకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.


Similar News