జిల్లాకు మంత్రి పదవి కోసం రాజీనామా కైనా సిద్ధం : ఎమ్మెల్యే

జిల్లాకు మంత్రి పదవి కోసం రాజీనామా కైనా సిద్ధం అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు.

Update: 2025-03-23 10:23 GMT
జిల్లాకు మంత్రి పదవి కోసం రాజీనామా కైనా సిద్ధం : ఎమ్మెల్యే
  • whatsapp icon

దిశ, శంషాబాద్ : జిల్లాకు మంత్రి పదవి కోసం రాజీనామా కైనా సిద్ధం అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని గ్రాండ్ ఫంక్షన్ నిర్వహించిన జిల్లా పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి 18 నెలలు గడుస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఎంతో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీ పదవులు నామినేట్ పదవులు రాక ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి కావాలని మంత్రి పదవి లేకుంటే లోకల్ బాడీ ఎన్నికల్లో ఇబ్బందులు కలుగుతాయి అని ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఆందోళన చెందుతున్నారు.

అదేవిధంగా హైదరాబాదుకు గుండెకాయ లాంటి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు మంత్రి పదవి లేకపోవడం కూడా నిరుత్సాహానికి గురిచేసిందన్నారు. జిల్లాలో ఏ సమస్య ఉన్న మంత్రికి చెప్పాలంటే మంత్రి పదవి లేదన్నారు. రంగారెడ్డి జిల్లాలో మంత్రి పదవి కోసం తాను రాజీనామా చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నానని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఏకైక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తనకు మంత్రి పదవి ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారన్నారు. అగ్రవర్ణాలకు మంత్రి పదవి రాదంటే తాను రాజీనామా చేసి ఇంకొకరిని ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించడానికి సిద్ధమన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి అండగా ఉండి వారిని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పిటిసిలుగా గెలిపించుకోవడానికి వెన్ను దండిగా ఉండి కృషి చేస్తానన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆలోచించి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలన్నారు.

Similar News