ఫార్మా ఫెన్సింగ్ పనుల అడ్డగింత.. భారీ బందోబస్తు నడుమ పనులు

ఫార్మాసిటీ భూములలో అధికారులు ఫెన్సింగ్ పనులను చేసుకుంటూ తమ పట్టా భూములలోకి వచ్చారని తాటిపర్తి రైతులు అడ్డుకున్నారు.

Update: 2025-04-11 15:54 GMT
ఫార్మా ఫెన్సింగ్ పనుల అడ్డగింత.. భారీ బందోబస్తు నడుమ పనులు
  • whatsapp icon

దిశ, యాచారం : ఫార్మాసిటీ భూములలో అధికారులు ఫెన్సింగ్ పనులను చేసుకుంటూ తమ పట్టా భూములలోకి వచ్చారని తాటిపర్తి రైతులు అడ్డుకున్నారు. దీంతో తీవ్రంగా ఆందోళన నెలకొంది తాటిపర్తి రెవెన్యూ పరిధిలోని పట్టా సర్వే నెంబర్లు 109, 114, లో నక్క పద్మయ్య, గుజ్జ సంగయ్య, దార సాయన్న, కుదరపు జంగయ్య, గుండ్ర వీరభద్ర రెడ్డి, మండలి రామదాసు, అనమోని రంగయ్య, 4 తరాలుగా భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తురని, పట్టా భూములలోకి 104 సర్వే హద్దురాల్లు వచ్చాయని అవి చూసుకోకుండా ఈ భూములలోకి అడుగుపెడితే 114 ఎకరాలు పోతాయని 56 కుటుంబాలు రోడ్డున పడుతాయని ఫార్మా వ్యతిరేక కమిటీ సభ్యులు కవ్వుల సరస్వతి, సామ నిరంజన్, రమేష్, చిట్టి నాగరాజు, ఆందోళన చేపట్టారు.

29 ఎకరాల చెరువు శికం భూమి, 5 ఎకరాలు పోచమ్మ దేవాలయం, భృహత్ పల్లె ప్రకృతి వనాలను భూదాన్ భూములను కూడా వదలడం లేదని అధికారులను నిలదీశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఇప్పుడున్న ప్రభుత్వం చేయొద్దని హెచ్చరించారు. సీఐ కృష్ణంరాజు, ఆందోళన కారుల వద్దకు చేరుకొని ఆర్డీవో అనంతరెడ్డి తో ఫోన్లో మాట్లాడారు. బుధవారం గ్రామస్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో నక్క మల్లయ్య, చిట్టి మల్లేష్, పోచమ్మ, చంద్రమ్మ, దార దశరథ, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.

Similar News