ఫార్మా విలేజ్ కాదు.. మల్టి పర్పస్ ఇండస్ట్రీయల్ పార్క్..
వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలంలోని పోలేపల్లి, హకీంపేట్, లగచెర్ల గ్రామాలలో మల్టి పర్పస్ ఇండస్ట్రీయల్ పార్క్ నెలకొల్పుటకు
దిశ ప్రతినిధి వికారాబాద్ : వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలంలోని పోలేపల్లి, హకీంపేట్, లగచెర్ల గ్రామాలలో మల్టి పర్పస్ ఇండస్ట్రీయల్ పార్క్ నెలకొల్పుటకు గాను టిజిఐఐసి వారి ప్రతిపాదనల మేరకు సబ్ కలెక్టర్ తాండూర్ డివిజన్ ను భూసేకరణ అధికారిగా నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా, పై 3 గ్రామాల పరిధిలో మల్టి పర్పస్ ఇండస్ట్రీయల్ పార్క్, టిజిఐఐసి డిపార్ట్మెంట్ ద్వారా నెలకొల్పుటకు గాను గెజిట్ నోటిఫికేషన్ ను సబ్ కలెక్టర్ అండ్ భూసేకరణ అధికారి, తాండూరు డివిజన్ వారు జారీ చేయడం జరిగినదని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఇదిలా ఉంటే లగచర్లలో కలెక్టర్ పై జరిగిన దాడి ఘటన అనంతరం, స్థానిక రైతుల అభిప్రాయం మేరకు ఫార్మా విలేజ్ ని ఉపసంహరించుకున్న ప్రభుత్వం, దాని స్థానంలో మల్టి పర్పస్ ఇండస్ట్రీయల్ పార్క్ ను ఏర్పాటు చేయనుంది.