ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాంగ్రెస్ గెలుపు ఆగదు : రేవంత్ రెడ్డి

ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్‌ గెలుపు ఆగదని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Update: 2023-10-12 17:00 GMT

దిశ, తాండూరు : ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్‌ గెలుపు ఆగదని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వద్ద తాండూరుకు చెందిన నేతలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.గురువారం మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఛలో గాంధీ భవన్ కార్యక్రమంలో భాగంగా తాండూరు నుంచి నేతలు, నాయకులు భారీగా తరలివెళ్లారు. అక్కడ టీపీసీపీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు జరిగాయి.ఇందులో తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితాసంపత్, డీసీసీబీ మాజీ చైర్మన్ కుమారుడు మహిపాల్ రెడ్డి, ఇతర నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ సముద్రం. కాంగ్రెస్‌ ప్రజల పార్టీ అని, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు పార్టీ గుర్తింపునిస్తుందని తెలిపారు. అధిష్టానం నిర్ణయం మేరకే కార్యకర్తలు పని చేయాలని, ఎమ్మెల్యే టికెట్‌ ఎవరికి వచ్చినా గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాలోని నాలుగు స్థానాలు కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోకుండా పని చేయాలని సూచించారు. ఛలో గాంధీభవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, మనోహర్ రెడ్డితో పాటు డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్, తాండూరు పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, కలాల్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News