శంషాబాద్ లో బ్రిడ్జి బడావో శంషాబాద్ కు బచావో రిలేనిరాహార దీక్ష..

శంషాబాద్ లో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ కు అదనంగా మరో ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషి చేస్తానని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.

Update: 2023-02-04 12:59 GMT

దిశ, శంషాబాద్ : శంషాబాద్ లో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ కు అదనంగా మరో ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషి చేస్తానని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో బ్రిడ్జి బడావో శంషాబాద్ కు బచావో అని తలపెట్టిన అఖిలపక్ష జేఏసీ రిలేనిరాహార దీక్షలు శనివారానికి 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ నిరాహార దీక్షకు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మద్దతు తెలిపారు. నేషనల్ హైవే రీజినల్ ఆఫీసర్ కుశావర్ తో కలిసి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పరిశీలించి అక్కడి నుంచి పొడిగించాల్సిన ఫ్లైఓవర్ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఇప్పుడు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ కు బదులుగా మరో అండర్పాస్ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టడానికి వీలు ఉంటుందని నేషనల్ హైవే రీజినల్ అధికారి ఎంపీ రంజిత్ రెడ్డికి తెలపడంతో జేఏసీ, నాయకులతో చర్చించారు.

అనంతరం ఆయన మాట్లాడుదూ శంషాబాద్ లో ఎప్పటి నుండో ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఇప్పుడు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ ను పొడిగించాలి, లేకుంటే మరో ప్లై ఓవర్ నిర్మించాలని ఆయన కోరారు. నేషనల్ హైవే రీజనల్ ఆఫీసర్ తెలిపిన ప్రకారం ఇప్పటికే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిందని అది కాకుండా అదనంగా మరో బ్రిడ్జి నిర్మించడానికి వీలుంటుందని తెలపడంతో ఢిల్లీలో అధికారులతో మాట్లాడి 15 రోజులలో మరో బ్రిడ్జి నిర్మాణానికి ఆర్డర్ కాపీ తీసుకువస్తానని అన్నారు. అనంతరం రెండు నెలల్లో బ్రిడ్జి పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంటానన్నారు.

ప్రతిఒక్క నాయకుడు సహకరించి రిలే నిరాహార దీక్షలను ఉపసంహరించుకోవాలన్నారు. అఖిలపక్ష నాయకులు ఎంపీ రంజిత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి రిలే నిరాహార దీక్ష చేస్తున్న నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్ మేకల వెంకటేష్, అఖిలపక్ష నాయకులు డాక్టర్ ప్రేమ్ రాజ్, గణేష్ గుప్త, వేణు గౌడ్, నందకిషోర్, రమేష్, ప్రభాకర్, శ్రీనివాస్, బొబ్బిలి కృష్ణయ్య, మురళి గౌడ్, యాదగిరి, రాజేందర్, శేఖర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News