ముత్యాలమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవంలో మంత్రి పొంగులేటి..

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూసుమంచి మండలంలో శనివారం పర్యటించారు.

Update: 2024-12-14 09:51 GMT

దిశ, కూసుమంచి : రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూసుమంచి మండలంలో శనివారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కూసుమంచి మండలంలోని పెరికసింగారం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట, ముత్యాలమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాయకన్ గూడెం గ్రామంలో మంజూరైనా నూతన అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు, జూకురి గోపాల్ రావు, భానోత్ శ్రీనివాస్ నాయక్, కూసుమంచి మాజీ ఎంపీటీసిమాదాసు ఉపేందర్ రావు, మోదుగు వీరభద్రం, గట్టుసింగారం మాజీ సర్పంచ్ చాట్ల పరశురాం, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News