స్పీకర్ ఖాతాలో రుణమాఫీ డబ్బులు
వికారాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట శాసన సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ బ్యాంకు ఖాతా నెంబర్ కు రైతు రుణమాఫీ పథకం కింద రూ.1,50,863 లు పొరపాటున జమ అయ్యాయి.
దిశ ప్రతినిధి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట శాసన సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ బ్యాంకు ఖాతా నెంబర్ కు రైతు రుణమాఫీ పథకం కింద రూ.1,50,863 లు పొరపాటున జమ అయ్యాయి. ఈ మేరకు జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ తెలిపారు. డీసీసీబీ బ్యాంకు తాండూర్ నుంచి టెక్నికల్ సమస్య వల్ల ఈ అమౌంట్ గడ్డం ప్రసాద్ కుమార్ బ్యాంకు ఖాతాలోకి జమ అయ్యాయి. ఈ విషయంపై స్పీకర్ ప్రసాద్ కుమార్ స్పందిస్తూ తన బ్యాంకు అకౌంట్ కు పొరపాటున వచ్చిన రుణమాఫీ డబ్బులను తిరిగి అదే బ్యాంక్ ద్వారా ప్రభుత్వానికి వాపసు చేయమని కోరగా, ఆ డబ్బులు బ్యాంకుకు తిరిగి చెల్లించినట్లు వ్యవసాయ జిల్లా అధికారి గోపాల్ తెలిపారు.