మీర్ పేట్ కార్పొరేషన్‌నీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుదాం : మంత్రి సబితా
కార్పొరేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంకులు పూర్తయితే మీర్ పేట్ ప్రజలకు ప్రతి రోజూ మంచినీళ్లు అందిస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.శనివారం కార్పొరేషన్ పరిధిలోని
దిశ, మీర్ పేట్: కార్పొరేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంకులు పూర్తయితే మీర్ పేట్ ప్రజలకు ప్రతి రోజూ మంచినీళ్లు అందిస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.శనివారం కార్పొరేషన్ పరిధిలోని 39,40,43 వార్డులలో 2 కోట్ల 58 లక్షల రూపాయల నిధులతో వివిధ కాలనీ ల లో చేపట్టే పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మీర్ పేట్ కార్పొరేషన్ లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. కార్పొరేషన్ పరిధిలో ట్రంక్ లైన్లు,నాళాల నిర్మాణాలతో వరదనీటి ముంపు సమస్యలకు పరిష్కారం చూపుతున్నట్లు, నాళాల అభివృద్ధికి 110 కోట్లతో మహేశ్వరం నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయన్నాని,తాగునీటి సమస్య లేకుండా చేయటానికి 210 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా పనులు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. నాడు 200 రూపాయలు ఉన్న పింఛన్లు నేడు 2 వేలకు పెంచి,3 వేలు ఉన్న వికలాంగుల పింఛన్లు ను 4 వేలకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.ఈ ప్రాంతంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్‌లు అర్హులైన పేదలకు అందిస్తామని, సొంత స్థలం ఉన్నవారికి 3 లక్షల గృహ లక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.
కార్పొరేషన్‌లో నల్లా బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని తన దృష్టికి వచ్చిందని నల్లా బిల్లు ల వెసులుబాటుకు సీఎం కేసీఆర్ దగ్గరికి తీసుకువెళ్ళి మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపిస్తానని, సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 42 వేల ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకొని సీఎం గొప్ప మనసు చాటుకున్నారన్నారు. తల్లి తండ్రి లేని అనాధ పిల్లల కోసం ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని సీఎం కేసీఆర్ పెద్ద మనసు చాటుకొని అనాధలైన పిల్లలకు ప్రభుత్వం తల్లితండ్రుల బాధ్యత తీసుకొని అండగా ఉంటారన్నారు, గత ఎన్నికల లో కార్పొరేషన్ లో 6 మెజార్టీ ఇచ్చారని చేసిన అభివృద్ధి పనులను చూసి వచ్చే ఎన్నికల్లో మీర్ పేట్ కార్పొరేషన్ లో 20 వేల మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో మేయర్ యం. దుర్గా ,డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి , ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి , కార్పొరేటర్లు గజ్జల రామచందర్ , రేఖ లక్ష్మణ్ ,సురేఖ రమేష్ ,సిద్దాల లావణ్య బీరప్ప ,అనిల్ కుమార్ యాదవ్, కమిషనర్ ఎ వాణి ,అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.