కల్వకుర్తి ప్రజలకు అందుబాటులో కసిరెడ్డి : రేవంత్ రెడ్డి

కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరపున కసిరెడ్డి నారాయణ రెడ్డి

Update: 2023-10-06 09:51 GMT

దిశ, ఆమనగల్లు : కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరపున కసిరెడ్డి నారాయణ రెడ్డి అందుబాటులో ఉంటారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు.శుక్రవారం అధికార పార్టీ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుండడంతో కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్నారు.ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలతో కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా కసిరెడ్డి నారాయణ రెడ్డి పోటీ చేస్తారని స్పష్టంగా తెలుస్తుంది.

Tags:    

Similar News