శంషాబాద్‌లో మద్యం మత్తులో వ్యక్తి హల్‌చల్
పీకలదాకా మద్యం సేవించి నడిరోడ్డుపై ఓ వ్యక్తి హంగామా
దిశ,శంషాబాద్ : పీకలదాకా మద్యం సేవించి నడిరోడ్డుపై ఓ వ్యక్తి హంగామా సృష్టించాడు. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న పూల బండి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే మంగళవారం పీకలదాకా మద్యం సేవించి నానా హంగామా సృష్టించాడు. రోడ్డుపై బట్టలు విప్పి విపరీతంగా అరుస్తూ ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలపై దాడి కిద్దిగాడు.
అక్కడ ఉన్న స్థానికులు ఎంతమంది వారించిన వారి బూతులు తిడుతూ అక్కడి నుండి వెళ్లకపోగా వాహనాలపై, వాహనదారులపై దాడికి దిగడంతో స్థానికులు మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని బలవంతంగా పక్కకు నెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. రోడ్డుపై మద్యం సేవించే వ్యక్తి హంగామా సృష్టిస్తున్నాడని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు వచ్చి అతన్ని వారించే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా మీరు ట్రాఫిక్ పోలీసులు గొడవలకు మీకేం సంబంధం అంటూ వాళ్లకే ప్రశ్న వేస్తూ కాసేపు రోడ్డుపై బైఠాయించి స్థానికులకు, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగించాడు. అక్కడే ఉన్న బండ్లపై పూలు అమ్ముకునే వారందరూ వచ్చి అతని బలవంతంగా ఎత్తుకొని వెళ్ళిపోయారు.