అభివృద్ధి చేశాను మరోసారి ఓటు వేసి గెలిపించండి : సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని మరోసారి కారు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
దిశ, మీర్ పేట్: మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని మరోసారి కారు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ పరిధిలోని లెనిన్ నగర్ , రైతు బజార్ పక్కన, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం లెనిన్ నగర్ శివాలయం దగ్గర బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నాడు లెనిన్ నగర్ ఎట్లుండెనో, నేడు ఎలా మారిందో చూడాలన్నారు. వర్షం వస్తే చాలు వరదతో ఇబ్బంది పడే కాలనీ వాసుల కష్టాలు ట్రంక్ లైన్ తో తీర్చినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానికులకు పట్టాలు అందించడానికి కృషి చేస్తానన్నారు. పెద్ద ఎత్తున యువత బీఆర్ఎస్ లో చేరటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వంత జాగా ఉన్నవారికి గృహ లక్ష్మి కింద 3 లక్షలు ఇస్తాం అన్నారు.
కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతుందని, ఎన్నికలు వస్తే స్తబ్దుగా ఉంచి, 5 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి అయిన వెంటనే తిరిగి పెంచుతారన్నారు. కానీ సీఎం కేసీఆర్ 400 రూపాయలకే గ్యాస్ సీలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ప్రతి నెల 3 వేల ఆర్థిక సహాయం చేయనున్నట్లు, ఆసరా పెన్షన్లు కూడా పెంచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ యం దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, పార్టీ ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, కార్పొరేటర్లు, సిద్దాల లావణ్య బీరప్ప, సౌందర్య విజయ్, వేముల నరసింహ, నవీన్ గౌడ్, రవి నాయక్, ఎడ్ల మల్లేష్ , బీఆర్ఎస్ నాయకులు దీప్లాల్ చౌహన్, కామేష్ రెడ్డి, దిండు భూపేష్ గౌడ్, పల్లె జంగయ్య గౌడ్ బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.