చెరువులోకి దూసుకెళ్లిన కారు...చివరికి..
మండల పరిధిలోని ఇప్పలపల్లి గ్రామ సమీపంలో ఉన్న చెరువులోకి మంగళవారం మధ్యాహ్నం కారు దూసుకెళ్లింది
దిశ,కేశంపేట: మండల పరిధిలోని ఇప్పలపల్లి గ్రామ సమీపంలో ఉన్న చెరువులోకి మంగళవారం మధ్యాహ్నం కారు దూసుకెళ్లింది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… షాద్ నగర్ నుండి వేములనర్వ వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్ళింది. కారులో ఒక్కరే ఉన్నట్లు గుర్తించగా, అందులో ఉన్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయట పడటం గమనార్హం. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.