మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట చేసిందని రాజేంద్రనగర్

Update: 2024-12-11 08:56 GMT

దిశ, శంషాబాద్ : మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట చేసిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవపల్లి డివిజన్ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘ సభ్యులకు 8 లక్షల రూపాయలతో 10 కుట్టు మిషన్లతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మంజూరు చేసిన స్టిచ్చింగ్ సెంటర్ ను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నైపుణ్యం ఉన్న ఆర్థిక పరిస్థితులు సహకరించగా ఇంటికే పరిమితమైన మహిళలకు అవకాశాలు అందించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ చర్యలు చేపట్టిందని అన్నారు.మహిళాల స్వయం ఉపాధికి బాటలు వేయడం తో పాటు వారి ఆర్థిక అభివృద్ధికి పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతుందన్నారు. మహిళలు వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా యూనిట్లు మంజూరు చేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్, నాయకులు ధనుంజయ్, వజ్రమ్మ, సరికొండ వెంకటేష్,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


Similar News