రోడ్డుపైనే చెత్త.. పడకేసిన పారిశుద్ధ్యం

మహేశ్వరం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం గత వారం రోజుల

Update: 2024-08-28 09:49 GMT

దిశ,మహేశ్వరం: మహేశ్వరం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం గత వారం రోజుల నుంచి పారిశుద్ధ్యం పడకేసింది.మహేశ్వరం మండల కేంద్రంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు,చికెన్, మటన్ షాపులు,హోటల్లు,పలు కిరాణా షాపుల యాజమానులు మహేశ్వరం నుంచి కేబీ తండా, ఉప్పుగడ్డ తండా వెళ్లే ప్రధాన రోడ్డు మీద,మహేశ్వరం నుంచి మన్సాన్పల్లి వెళ్లే ప్రధాన రోడ్డు పక్కన ఇష్టమొచ్చినట్లు చెత్త వేస్తున్నారాన్ని గ్రామస్థులు పేర్కొంటున్నారు.రోడ్డు పక్కన చేత వేయడంతో మహేశ్వరం మండలం కేంద్రం నుంచి ఉప్పు గడ్డ తండా వెళ్లే రహదారి పై దుర్వాసన వెదజల్లుతోంది.పంచాయతీ అధికారులు స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాలు నిర్వహించిన్నప్పుడే రోడ్డును శుభ్రంగా ఉంచుతున్నారు. మిగతా సమయంలో రోడ్డును శుభ్రంగా ఉంచడం లేదన్ని ఉప్పు గడ్డ తండా, మన్సాన్పల్లి గ్రామాల వైపు వెళ్లే ప్రయాణికులు పేర్కొంటున్నారు.ఉప్పుగడ్డ తండా వెళ్లే రోడ్డుపైన చెత్త వేసే వారిపై పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

అధికారులు చర్యలు తీసుకోవాలి : మునవాత్ దేవేందర్, కేబీ తండా

మహేశ్వరం నుంచి ఉప్పు గడ్డ తండా వెళ్లే రోడ్డు పక్కన విచ్చలవిడిగా చెత్త వేస్తున్నారు.తండాకు వెళ్లే సమయంలో చెత్త నుంచి దుర్వాసన వెదజల్లుతోంది.పంచాయతీ అధికారులు వెంటనే పరిశుభ్రం చేయాలి.రోడ్డు పక్కన చెత్త వేసే వారిపై పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలి.


Similar News