డ్రగ్స్ ను శాశ్వతంగా తరిమికొట్టాలి.. ఎస్పీ సాయిచైతన్య పిలుపు

Update: 2024-08-14 15:28 GMT

దిశ, చేవెళ్లః డ్రగ్స్ ను జిల్లా నుంచి శాశ్వతంగా తరిమికొట్టాలని, అందుకు ఆంటీ డ్రగ్స్ వారియర్ గా విద్యార్థులు ఉండాలని ఆంటీ నార్గోటిక్ బ్యూరో ఎస్పి సాయి చైతన్య పేర్కొన్నారు. తెలంగాణ అంటి నార్గోటిక్ బ్యూరో చెప్పట్టిన మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా చేవెళ్ల మండల కేంద్రంలో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ సాయి చైతన్య మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే సమస్యల గురించి వాటి వల్ల సమాజంలో జరిగే అలజడి గురించి వివరించారు. రాష్ట్రంలో డ్రగ్స్ కు తావు లేకుండా చేయడమే లక్ష్యం అన్నారు. చేవెళ్ల గ్రామీణ ప్రాంతం కావడంతో ఆసుపత్రికి గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు కనుక విద్యార్థులు వారికి డ్రగ్స్ వాడకంపై కలిగే నష్టాలను వివరించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డిన్ సత్యనారాయణ, సూపరిడెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ జోయా రాణి, చేవెళ్ల సిఐ భూపాల్ శ్రీధర్, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, ఎంబిబిఎస్ అధ్యాపకులు, ఎండి విద్యార్థుల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News