‘ఇక్కడ నేనే తోపు..నేనే రాజు.. నీ సంగతి చూస్తా’..మాజీ సర్పంచ్ బెదిరింపులు
ఈ నెల27న దిశ పత్రికలో వెంచర్ కోసం కాలువ
దిశ, తాండూరు : ఈ నెల27న దిశ పత్రికలో వెంచర్ కోసం కాలువ దారి మళ్ళింపు! అనే శీర్షికన " దిశ " దినపత్రిక ప్రచురించింది. ఈ వార్తను చదివి "దిశ" రిపోర్టర్ ఫోన్ చేసి వెంచర్ లో ఎక్కడ కాలువ పొడిచి.. కాలువ దారి మళ్ళించామో.. చూడటానికి యా లం** కొడుకులను తెస్తావ్.. ఎమ్మార్వో గాని తెస్తావా..అని బెదిరించాడు. వెంచర్ గురించి,నా గ్రామ పరిధిలో మరొక్కసారి వార్తలు రాస్తే గు* పగలగొడతానని అన్నాడు.అంతే కాకుండా నేను ఎవరనుకున్నావ్ యాలాల మండలంలో అయినా, అగ్గనూర్ గ్రామంలో అయినా నేనే తోపు.. ఇక్కడ ఏం చేయాలన్నా నా అనుమతి తప్పనిసరి, సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ నేనే రాజు నేనే మంత్రి చివరికి నేనే చట్టం అని అలాంటి నాకు సంబంధించిన వెంచర్ పై వార్త రాయడానికి నీకు ఎంత ధైర్యం. ఎక్కడున్నావ్ చెప్పు కారులో వచ్చి నిన్ను చంపేస్తా అంటూ విలేకరికి అగ్గనూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఫోన్ బెదిరించాడు. ఏ ఎమ్మారో, ఏ ఇరిగేషన్ అధికారి నా ముందు నిలబడాలి అంటే భయపడతారు. నేనంటే వారికి అంత భయం. అలాంటి నాపై వార్త రాసే ధైర్యం నీకు ఎవరిచ్చారు..? మరోసారి ఇలాంటి వార్త రాస్తే చంపేస్తా అంటూ మాజీ సర్పంచ్ బెదిరింపులకు పాల్పడ్డాడు. పైగా నువ్వు తాండూర్ లో ఎలా తిరుగుతావో చూస్తా అంటూ భయభ్రాంతులకు గురిచేయడం గమనార్హం.