దిశ ఎఫెక్ట్ : స్పందించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామంలో కొన్ని రోజుల నుంచి మిషన్ భగీరథ పైపు పగిలి నీళ్లు మొత్తం రహదారికి వస్తున్న కథనం ఈనెల 20న దిశ దినపత్రికలో ప్రచురితమైంది
దిశ,నందిగామ: నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామంలో కొన్ని రోజుల నుంచి మిషన్ భగీరథ పైపు పగిలి నీళ్లు మొత్తం రహదారికి వస్తున్న కథనం ఈనెల 20న దిశ దినపత్రికలో ప్రచురితమైంది. పగిలిన మిషన్ భగీరథ పైప్ అనే కథనానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎట్టకేలకు స్పందించారు. పగిలిపోయిన మిషన్ భగీరథ పైపుకు గురువారం మరమ్మతులు చేపట్టారు. మిషన్ భగీరథ పైప్ కు మరమ్మతులు చేపట్టడంపై గ్రామస్తులు దిశకు కృతజ్ఞతలు తెలిపారు.