ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ‘దిశ’ దినపత్రిక : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే
సంచలనాలకు మారు పేరు దిశ దినపత్రిక 2025 సంవత్సర
దిశ, ఇబ్రహీంపట్నం : సంచలనాలకు మారు పేరు దిశ దినపత్రిక 2025 సంవత్సర క్యాలెండర్ ను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో సంచలన వార్తలతో నిజాలను నిక్కచ్చిగా, నిర్భయంగా ప్రజలకు తెలియజేస్తున్న ఏకైక దినపత్రిక దిశ అని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా దిశ దినపత్రిక పనిచేస్తుందని ప్రజల సమస్యలపై నిరంతరం ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేయడంలో దిశ ముందంజ లో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం రిపోర్టర్ మొలుగు శ్రీనివాస్, చిన్నెల్లి నర్సింహ్మ, దొండ విష్ణువర్ధన్ రెడ్డి, మంకాల దాసు, మొలుగు నర్సింహ్మ, చిన్నెల్లి మహేష్, మంకాల కరుణాకర్, మచ్చ మహేష్, మచ్చ సురేష్, చెన్ రెడ్డి వెంకట్ రెడ్డి, చిన్నెల్లి యాదయ్య, మంకాల అశోక్, కర్రే అబ్బయ్య, ఐతపాక నరేష్, గువ్వల సురేందర్, కర్రే ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.