తెలంగాణ ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలి..

మహ శివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్న శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి రాజరాజేశ్వరి దేవి ఆలయానికి భక్తులు తెల్లవారుజామున నుంచి బారులు తీరారు.

Update: 2023-02-18 12:03 GMT

దిశ, మహేశ్వరం : మహ శివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్న శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి రాజరాజేశ్వరి దేవి ఆలయానికి భక్తులు తెల్లవారుజామున నుంచి బారులు తీరారు.హైదారాబాద్,రంగారెడ్డి,నల్గొండ జిల్లాల నుంచి, చుట్టూ ప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములు యాదవ్, బడంగ్ పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...పరమేశ్వరుడి కృపతో సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అస్టైశ్వర్యా లతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నారు.పరమేశ్వరుడి కృప తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ నిర్వహకులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సునీత ఆంద్యా నాయక్, ఆలయ కమిటీ చైర్మన్ సుధీర్ గౌడ్,గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేష్,ఎంపీటీసీ పోతర్ల సుదర్శన్ యాదవ్,పలు రాజకీయ నాయకులు,అధికారులు స్వామిని వారిని దర్శించుకున్నారు.

Tags:    

Similar News